ఏపీలో రూ.5,001 కోట్లతో LG తయారీ యూనిట్...! 12 d ago
కూటమి ప్రభుత్వంలో ఏపీకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ LG ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్ లో LG ఉత్పత్తులకు ఉన్న డిమాండు మేరకు కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. స్థానిక మార్కెట్‌లో ముడి సరకుల ధరలు పెరుగుతున్నాయని, ఇక్కడ యూనిట్ ను ఏర్పాటు చేయడం వల్ల తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అందించే వెసులుబాటు కలుగుతుందని సంస్థ పేర్కొంది.
అయితే స్థానికంగా యూనిట్ను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రీమియం విభాగంలో విడిభాగాలు, ఇతర ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో LG సంస్థ రూ.5,001 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలన్న ప్రతిపాద నకు గత నెలలో జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.